బుధవారం 30 సెప్టెంబర్ 2020
Telangana - Aug 11, 2020 , 23:27:04

ఫుట్‌బాల్‌ ఆటలో అగ్రేసరుడు

ఫుట్‌బాల్‌ ఆటలో అగ్రేసరుడు

పీవీ బాల్యం నుంచి మేధావి. సరస్వతీ పుత్రుడు. చదువులోనే కాదు.. ఆటల్లోనూ ఆరితేరినవారు. పర్యాటక ప్రదేశాలను, కొత్త ప్రాంతాలను తిరిగే అలవాటు కూడా ఆయనకు ఉండేది. టెన్నిస్‌ ఎక్కువగా ఆడే పీవీకి ఫుట్బాల్‌ ఆట అంటే కూడా తెగ ఇష్టం. హైస్కూల్లో చదువుతున్నపుడు తన కాళ్లతో ఫుట్‌బాల్‌ ఓ ఆటాడుకునేవారు. ప్రత్యర్థులకు బంతి దొరక్కుండా గ్రౌండ్‌ అంతటా తిరుగుతూ వాళ్లకు చెమటలు పట్టించేవారు. మాయచేసినట్టు క్షణాల్లో బాల్ను గోల్పోస్ట్లోకి పంపేవారు. క్రికెట్‌ అన్నా పీవీకి ఇష్టమే. వృద్ధాప్యం వచ్చినా ఓ సందర్భంలో బ్యాట్‌ పట్టి వహ్వా! అనిపించారు.


logo