శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Sep 15, 2020 , 02:58:22

హైకోర్టులో ఏజీ కాన్ఫరెన్స్‌ హాల్‌

హైకోర్టులో ఏజీ కాన్ఫరెన్స్‌ హాల్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: హైకోర్టు ప్రాంగణంలో అడ్వకేట్‌ జనరల్‌ కాన్ఫరెన్స్‌హాల్‌ను చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ సోమవారం ప్రారంభించారు. వివిధ కేసులపై హైకోర్టుకు వచ్చే ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులతో ఏజీ, ఏఏజీ, ఇతర న్యాయవాదులు సమావేశాల నిర్వహణకు దీనిని ఏర్పాటుచేశారు. కార్యక్రమంలో జడ్జిలు జస్టిస్‌ చల్లా కోదండరాం, జస్టిస్‌ షమీమ్‌అక్తర్‌, జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి, ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు. 


logo