సోమవారం 01 జూన్ 2020
Telangana - May 01, 2020 , 01:09:03

సగరుల గౌరవం పెంచిన సర్కారు

సగరుల గౌరవం పెంచిన సర్కారు

  • భగీరథ జయంతిలో మంత్రి ఈటల రాజేందర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీసీ కులాలకు ప్రాధాన్యం పెరిగిందని, కేసీఆర్‌ పాలనలో సగర, ఉప్పరులకు గౌరవం మరింత పెరిగిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ప్రభుత్వ కాంట్రాక్టు పనుల్లో రూ.కోటి వరకు ఈఎండీ లేకుండానే అప్పగిస్తున్నామని చెప్పారు. భగీరథ జయంతిని పురస్కరించుకుని తన నివాసంలో మంత్రి ఈటల గురువారం పూజలు నిర్వహించారు. నిర్మాణరంగంలో నైపుణ్యాభివృద్ధి కోసం ఉప్పరులకు నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ (ఎన్‌ఏవీ) ద్వారా శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సగర, ఉప్పర సంఘం రాష్ట్ర నాయకులు బంగారు నర్సింహ, మాదంశెట్టి సువర్ణ, మాదంశెట్టి కృష్ణ, రాంపురం రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు. భగీరథ జయంతి సందర్భంగా సగర, ఉప్పర, సంఘం ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని సంఘం భవనంలో రక్తదానం చేసినవారిని మంత్రి అభినందించారు. logo