ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 14, 2020 , 09:12:02

కరోనా నుంచి కోలుకున్న తరువాత.. తిరిగి విధుల్లోకి హోంమంత్రి మహమూద్‌ అలీ

కరోనా నుంచి కోలుకున్న తరువాత.. తిరిగి విధుల్లోకి హోంమంత్రి మహమూద్‌ అలీ

హైదరాబాద్‌ : కరోనావైరస్ నుంచి కోలుకున్న తర్వాత హోంమంత్రి మహ్మద్ మహమూద్ అలీ సోమవారం తన విధులను తిరిగి ప్రారంభించారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, పోలీస్ కమిషనర్లు, పలువురు ఐపీఎస్‌ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి రాష్ట్ర శాంతిభద్రతల గురించి ఆయన ఆరా తీశారు. రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తుండడంతో ప్రజల్లో విశ్వాసం పెంపొందించాలని ఆయన పోలీసు అధికారులను ఆదేశించారు. వైరస్ నుంచి భయాందోళనలకు గురికాకుండా ముందు జాగ్రత్తలు పాటించాలని మహమూద్ అలీ ప్రజలకు సూచించారు. కోవిడ్ వ్యాక్సిన్ ఇంకా తయారు చేయలేదని మహమూద్ అలీ లిఖితపూర్వక ప్రకటనలో తెలిపారు. అతను సాధారణ ఔషధాల నుంచి కోలుకున్నట్లు పేర్కొన్నారు. రోగనిరోధక శక్తిని పెంచడానికి, రోజూ అరగంట వ్యాయామం చేస్తూ బలవర్ధక ఆహారం తీసుకోవాలని ఆయన ప్రజలను కోరారు. 

తాను ఆస్తమా రోగి కావడం వల్ల కరోనా వైరస్‌ సోకడంతో భయపడ్డానని, కాని పాజిటివ్‌గా తేలినప్పటి నుంచి మంచి ఆహారం తీసుకోవడం, వైద్యుల సలహాల మేరకు తగు జాగ్రత్తలతో వ్యాధి నుంచి బయట పడినట్లు ఆయన పేర్కొన్నారు. హోంమంత్రి అపోలో దవాఖానలో చికిత్స పొందారు. హోంమంత్రి కుమారుడు అజామ్ అలీ ఖుర్రామ్, అతని మనవడు ఫుర్కాన్ అహ్మద్ కూడా కరోనా పాజిటివ్‌గా సోకిన తరువాత వారు అపోలో దవాఖానలోనే చికిత్స పొందారు. 


logo