బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Nov 02, 2020 , 07:35:38

55 రోజుల త‌ర్వాత రిజిస్ట్రేష‌న్లు షురూ..

55 రోజుల త‌ర్వాత రిజిస్ట్రేష‌న్లు షురూ..

హైద‌రాబాద్‌: ‌రాష్ట్రంలో 55 రోజుల త‌ర్వాత భూముల రిజిస్ట్రేష‌న్లు మ‌ళ్లీ ప్రారంభం కానున్నాయి. ప‌్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ప్రారంభించిన ధ‌ర‌ణి పోర్ట‌ల్ ద్వారా నేటినుంచి రిజిస్ట్రేష‌న్లు, మ్యుటేషన్లు అందుబాటులోకి రానున్నాయి. అయితే ప్ర‌స్తుతం వ్య‌వ‌సాయ భూముల రిజిస్ట్రేష‌న్లు, మ్యుటేష‌న్లు మాత్ర‌మే ప్రారంభం కానున్నాయి. వ్య‌వ‌సాయేత‌ర భూముల రిజిస్ట్రేష‌న్ల‌కు మ‌రికొన్నిరోజుల స‌మ‌యం ప‌ట్ట‌నుంది. 

హైద‌రాబాద్ జిల్లా ప‌రిధిలోని 20 మండ‌లాలు మిన‌హా రాష్ట్ర‌వ్యాప్తంగా ధ‌ర‌ణి సేవ‌లు అందుబాటులోకి రానున్నాయి. 570 తహ‌సీల్దార్ కార్యాల‌యాల్లో ధ‌ర‌ణి పోర్ట‌ల్ సేవ‌లు అందుబాటులో ఉన్నాయి. మీ-సేవా కేంద్రాల ద్వారా స్లాట్లు న‌మోదు చేసుకోవ‌డానికి ప్ర‌భుత్వం అవ‌కాశం క‌ల్పించింది. ప‌ది ప‌త్రాల‌లోపు ప్ర‌క్రియ‌తోపాటు స్లాట్‌కు రూ.200 రుసుం నిర్ణ‌యించింది. ప‌ది ప‌త్రాల త‌ర్వాత ప్ర‌తి ప‌త్రానికి రూ.5 చెల్లించాల‌ని సూచించింది. ధ‌ర‌ణి పోర్ట‌ల్ ద్వారా అర‌గంట‌లోనే రిజిస్ట్రేష‌న్, మ్యుటేష‌న్ పూర్త‌వుతుంది. వారం, ప‌ది రోజుల‌ వ్య‌వ‌ధిలోనే పాసుపుస్త‌కం ఇంటికి చేరేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.