శనివారం 28 మార్చి 2020
Telangana - Mar 19, 2020 , 01:50:45

మనసున్న మారాజు కేటీఆర్‌

మనసున్న మారాజు కేటీఆర్‌

  • యువకుడి మెరుగైన చికిత్సకు రూ.3 లక్షల ఎల్వోసీ మంజూరు 
  • మంత్రికి బాధిత కుటుంబం  కృతజ్ఞతలు

గంభీరావుపేట : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్న ఓ యువకుడికి మెరుగైన చికిత్స కోసం  మంత్రి కేటీఆర్‌ రూ.3 లక్షల ఎల్వోసీ మంజూరుచేసి ఔదార్యం చాటుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట తండాకు చెందిన భూక్య శ్రీరామ్‌ ఈ నెల 5న బైక్‌ ప్రమాదానికి గురయ్యాడు. కుడికాలుతోపాటు కుడి వైపు నడుము భాగంలో తీవ్రంగా గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం శ్రీరామ్‌ను హైదరాబాదులోని ఓ ప్రైవేటు దవాఖానకు తీసుకెళ్లగా.. కుడి కాలుకు రెండు ప్రాం తాల్లో, నడుము భాగంలో శస్త్రచికిత్స చేయాలని, అందుకు రూ.3 లక్షల వరకు అవసరమని వైద్యులు సూచించారు.


దీంతో శ్రీరామ్‌ కుటుంబసభ్యులు గంభీరావుపేట ఏఎంసీ చైర్మన్‌ లింగన్నగారి దయాకర్‌రావును ఆశ్రయించగా, ఆయన ఈ నెల 15న మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి చికిత్సకు రూ.3 లక్షల ఎల్వోసీ మంజూరు చేశారు. పత్రాన్ని బుధవారం హైదరాబాదులోని హాస్పిటల్‌లో యువకుడి కుటుంబసభ్యులకు దయాకర్‌రావు అందజేశారు. ఆరోగ్య ఖర్చులకు అండగా నిలచిన మంత్రి కేటీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని శ్రీరామ్‌ కుటుం బ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.


logo