బుధవారం 03 జూన్ 2020
Telangana - Mar 31, 2020 , 02:16:12

వైద్యుల రక్షణకు ఏరోసోల్‌ బాక్స్‌

వైద్యుల రక్షణకు ఏరోసోల్‌ బాక్స్‌

  • టీ వర్క్స్‌, నిమ్స్‌, బటర్‌ఫ్లై ఎడుఫీల్డ్స్‌ సంయుక్త రూపకల్పన

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ బారినపడినవారికి చికిత్స అందిస్తున్న వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది కూడా అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి సమస్యల నుంచి వారిని రక్షించేందుకు టీ వర్క్స్‌, బటర్‌ఫ్లై ఎడుఫీల్డ్స్‌, నిమ్స్‌ సంయుక్తంగా ఏరోసోల్‌ బాక్స్‌ను తయారుచేశాయి. తైవాన్‌ ఐసొలేషన్‌ బాక్స్‌ ను నమూనాగా తీసుకుని ఏరోసోల్‌ బాక్స్‌ సిద్ధంచేశారు. నాలుగు రోజుల్లోనే వీటిని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ బాక్స్‌ను కరోనా వైరస్‌తో బాధపడుతున్న వారికి అమర్చి, వాటికున్న మూడు రంధ్రాల ద్వారా వైద్యం అందించడం వల్ల వైద్యులు, ఇతర సిబ్బందికి రక్షణగా ఉంటుంది. నిమ్స్‌లో విజయవంతంగా పరీక్షించారు.  

వైద్య సిబ్బంది రక్షణే లక్ష్యం 

వైద్య సిబ్బంది రక్షణే లక్ష్యంగా ఏరోసోల్‌ బాక్స్‌, ఫేస్‌ షీల్డ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు బటర్‌ఫ్లై ఎడుఫీల్డ్స్‌ సీఈవో శరత్‌చంద్ర తెలిపారు. వీటి వాడకం వల్ల వైద్యసిబ్బందికి ఇన్‌ఫెక్షన్‌ రాకుండా ఉంటుం దని చెప్పారు. ఇప్పటివరకు 500 వరకు ఫేస్‌ షీల్డ్స్‌ తయారుచేసి.. నిమ్స్‌కు 300 ఇచ్చా మని, లక్ష ఫేస్‌ షీల్డ్స్‌ తయారీ లక్ష్యంగా పెట్టుకొన్నట్టు పేర్కొన్నారు.


logo