బుధవారం 03 జూన్ 2020
Telangana - May 07, 2020 , 01:42:12

సీఎం కేసీఆర్‌కు న్యాయవాదుల కృతజ్ఞతలు

సీఎం కేసీఆర్‌కు న్యాయవాదుల కృతజ్ఞతలు

  • రూ.25 కోట్లు కేటాయింపు ప్రకటనపై హర్షం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌తో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న న్యాయవాదులను ఆదుకొనేందుకు సీఎం కేసీఆర్‌ రూ.25 కోట్లు కేటాయింపు ప్రకటనపై లాయర్లు హర్షం వ్యక్తంచేశారు. తమ సమస్యలపై వెంటనే స్పందించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.  రంగారెడ్డి జిల్లా కోర్టుల ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో న్యాయవాద జేఏసీ అధ్యక్షుడు కొంతం గోవర్ధన్‌రెడ్డి, టీ శ్రీధర్‌రెడ్డి, పానుగంటి అరుణ్‌కుమార్‌, చక్రధర్‌, భరత్‌రెడ్డి తదితరులు సీఎం కేసీఆర్‌, ఏజీ బీఎస్‌ ప్రసాద్‌, బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు గండ్ర మోహన్‌రావుకు ధన్యవాదాలు తెలిపారు. 

దంత వైద్యులను ఆదుకోవాలని విజ్ఞప్తి 

యువ న్యాయవాదులను ఆదుకున్నట్టుగానే యువ దంత వైద్యులు, చిన్నస్థాయి క్లినిక్‌ ప్రాక్టీషనర్లను ఆదుకోవాలని తెలంగాణ దంత వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మార్థినేని ప్రియాంక సీఎంను కోరారు. ప్రజలను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్‌ తీసుకుంటున్న నిర్ణయాలు హర్షణీయమని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 


logo