శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Oct 10, 2020 , 02:14:38

సీఎం కేసీఆర్‌కు లాయర్ల కృతజ్ఞతలు

సీఎం కేసీఆర్‌కు లాయర్ల కృతజ్ఞతలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా కష్టకాలంలో ఉపాధిలేక ఇబ్బందులు పడుతున్న వేళ రెండోవిడుత రూ.10 కోట్లు ఆర్థికసాయం విడుదలచేయడంపై న్యాయవాదులు హర్షం వ్యక్తంచేశారు. న్యాయవాదులకు రూ.25 కోట్లు కేటాయించి ఇప్పటికే రూ.15 కోట్లు అందజేశారని, ప్రస్తుతం రూ.10 కోట్లు విడుదలచేశారని పేర్కొంటూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటివరకు దేశంలో ఏ ముఖ్యమంత్రి.. న్యాయవాదులకు ఇంత పెద్దఎత్తున ఆర్థికసాయం చేయలేదని టీఆర్‌ఎస్‌ లీగల్‌ సెల్‌ నాయకులు చెప్పారు. అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ను శుక్రవారం కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు సీ కల్యాణ్‌రావు, గొరిగె మల్లేశ్‌కురుమ, చంద్రశేఖర్‌రావు, అజయ్‌కుమార్‌, మురళీధర్‌ పాల్గొన్నారు. మరోవైపు, నిధుల విడుదలపై అడ్వకేట్‌ జేఏసీ నాయకులు కూడా హర్షం వ్యక్తంచేశారు. రంగారెడ్డి జిల్లా కోర్టుల్లో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కొంతం గోవర్ధన్‌రెడ్డి, దాచం రాంరెడ్డి, సీహెచ్‌ ఉపేందర్‌, రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


logo