శనివారం 05 డిసెంబర్ 2020
Telangana - Nov 13, 2020 , 16:54:14

గజ్వేల్‌లో అధునాత‌న భూసార పరీక్షా కేంద్రం : మంత్రి హరీశ్ రావు

గజ్వేల్‌లో అధునాత‌న భూసార పరీక్షా కేంద్రం : మంత్రి హరీశ్ రావు

సిద్దిపేట : గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని రైతులకు రూ.18 లక్షల వ్యయంతో కూడిన ఆధునాతన భూసార పరీక్షా కేంద్రాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా వ‌ర్గ‌ల్ త‌హ‌సీల్దార్ కార్యాల‌యాన్ని మంత్రి శుక్ర‌వారం ఆక‌స్మికంగా సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ధ‌ర‌ణి పోర్ట‌ల్ ద్వారా జ‌రిగిన భూ క్రయ, విక్ర‌యాల వ్య‌వ‌హారాన్ని ప‌రిశీలించారు. అనంత‌రం మంత్రి మాట్లాడుతూ.. గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో భూసార ప‌రీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు చెప్పారు. సాయిల్ టెస్ట్ కేంద్రాన్ని నియోజకవర్గ రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ పద్మాకర్, గజ్వేల్ ఆర్డీఓ విజయేందర్ రెడ్డి, తహశీల్దార్ వాణి, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ-శ్రీనివాస్, మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.