గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Aug 02, 2020 , 18:45:32

హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో అధునాతన యంత్రం

హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో అధునాతన యంత్రం

హైదరాబాద్ : ప్రస్తుతం కొవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం విదేశాల్లోని భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చే అతి పెద్ద ఎవాక్యుయేషన్ కార్యక్రమం అయిన ‘వందే భారత్ మిషన్’ ద్వారా మన దేశానికి వస్తున్న అంతర్జాతీయ రిలీఫ్ ఫ్లయిట్స్‌ను హ్యాండిల్ చేస్తున్నది . విమానాశ్రయంలో ఎయిర్‌పోర్టు హెల్త్ అధికారుల (APHO) ద్వారా కొవిడ్ లక్షణాలు కలిగిన ప్రయాణికులను గుర్తించి, కరోనా వ్యాపించకుండా అరికట్టడం, అలాంటి ప్రయాణికులకు అవసరమైన వైద్య సేవలు అందించచడానికి విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులు, విమాన సిబ్బంది తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. 

ఈ స్క్రీనింగ్ విధానం సామర్థ్యం పెంచడానికి భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, ఏసియన్ డెవప్ మెంట్ బ్యాంక్ సహకారంతో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఒక అత్యాధునిక థర్మల్ స్కానర్ – ఒక ‘మాస్ ఫీవర్ స్ర్కీనింగ్ సిస్టమ్‌’ను అందించింది. దీనికి UNICEF (యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్) నిధులను అందజేసింది.  ఇది స్ర్కీనింగ్ ద్వారా చర్మం ఉష్ణోగ్రతను కొలిచి, జ్వర సంబంధమైన లక్షణాలున్న వ్యక్తులను గుర్తిస్తుంది. ఈ స్కానర్ ఎలాంటి మానవ ప్రమేయమూ లేకుండానే చుట్టూ ఉన్న ఉష్ణోగ్రతకు తగినట్లు అడ్జస్ట్ చేసుకుని, దానికి అనుకూలంగా మారిపోతుంది.

ప్రస్తుతం ఉన్న థర్మల్ స్కానర్లతో పాటు ఈ నూతన థర్మల్ స్కానర్ వల్ల హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ హెల్త్ ఆర్గనైజేషన్‌కు ప్రయాణికుల స్క్రీనింగ్‌పై మరింత నియంత్రణ ఉంటుంది.   ఈ సందర్భంగా ప్రదీప్ పణికర్, సీఈఓ, జీహెచ్‌ఐఎఎల్, ‘‘హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆ ఆధునిక పరికరాన్ని ఏర్పాటు చేసిన ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వారికి  కృతజ్ఞతలు తెలిపారు. ఈ నూతన పరికరంతో ఎయిర్ పోర్టులో 24 గంటల పాటు విధులు నిర్వర్తించే ఆరోగ్య శాఖ అధికారుల పని సులభతరం అవుతుంది.’’ అన్నారు.  

అలాగే  ప్రయాణికుల స్క్రీనింగ్ అనంతరం, వారు ఇమిగ్రేషన్ క్లియరెన్స్ వైపు వెళ్లడం జరుగుతుంది. అక్కడ ప్రయాణికులు, ఇమిగ్రేషన్ అధికారులు ఒకరినొకరు తాకడాన్ని నివారించడానికి ఇమిగ్రేషన్ కౌంటర్ల వద్ద గ్లాస్ షీల్డులు బిగించారు. ప్రతి కౌంటర్ వద్దా సామాజిక దూరం నిబంధనలను ఏర్పాటు చేశారు. విమానం ద్వారా వస్తున్న మొత్తం బ్యాగేజీని బ్యాగేజ్ బెల్టుకు అనుసంధానం చేసిన డిస్‌ఇన్ఫెక్షన్ టన్నెల్ ద్వారా శానిటైజ్ చేస్తున్నారు. బ్యాగేజ్ హాలులోని అన్ని బ్యాగేజ్ ట్రాలీలను కూడా ప్రయాణికుల కోసం పూర్తిగా శానిటైజ్ చేస్తున్నారు.


తాజావార్తలు


logo