శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Aug 02, 2020 , 01:51:01

ముగ్గురు అనాథ పిల్లల దత్తత

ముగ్గురు అనాథ పిల్లల దత్తత

  • l ప్రముఖ సినీ నిర్మాత దిల్‌రాజు ప్రకటన
  • l మంత్రి ఎర్రబెల్లి కోరిక మేరకు నిర్ణయం

ఆత్మకూరు(ఎం): తల్లిదండ్రుల మృతితో అనాథలైన ముగ్గురు చిన్నారులను దత్తత తీసుకునేందుకు ప్రముఖ సినీ నిర్మాత దిల్‌రాజు ముందుకు వచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండల కేంద్రానికి చెందిన గట్టు సత్తయ్యకు భార్య అనురాధతోపాటు పిల్లలు మనోహర్‌(9), లాస్య(6), యశ్వంత్‌(4) ఉన్నారు. అనారోగ్యంతో సత్తయ్య-అనురాధ ఇద్దరూ సంవత్సర వ్యవధిలో చనిపో వడంతో పిల్లలు అనాథలుగా మారారు. వీరి దీనస్థితిపై మీడియాలో కథనాలు వెలువడ్డాయి. చిన్నారుల గురించి తెలుసుకున్న పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చలించిపోయారు. శనివారం ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, ఆత్మకూరు(ఎం) సర్పంచ్‌ నగేశ్‌లతో మాట్లాడారు. ప్రముఖ సినీ నిర్మాత దిల్‌రాజుకు ఫోన్‌చేసి పిల్లలను దత్తత తీసుకోవాలని ఎర్రబెల్లి కోరారు. మంత్రి సూచనకు దిల్‌రాజు సానుకూలంగా స్పందించారు. అడగ్గానే అనాథ పిల్లలను దత్తత తీసుకుంటానని  ముందుకొచ్చిన  దిల్‌రాజుకు మంత్రి ఎర్రబెల్లి కృతజ్ఞతలు తెలిపారు. logo