శనివారం 30 మే 2020
Telangana - May 07, 2020 , 02:08:52

మేమేమిటో మా పనే చెప్తుంది

మేమేమిటో మా పనే చెప్తుంది

  • రాచకొండ పోలీస్‌కు డీజీపీ అభినందన 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ‘మేమం టే ఏమిటో మాపనే చెప్తుంది’ అని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. పోలీసులు వారి పీఎస్‌ల పరిధిలోని వృద్ధాశ్రమాలను దత్తత తీసుకోవాలని ఇప్పటికే ఆదేశించారు. డీజీపీ సూచనమేరకు రాచకొండ పోలీసులు ఘట్‌కేసర్‌లోని లాహిరి వృద్ధాశ్రమాన్ని దత్తత తీసుకుని వారికి కావాల్సిన సరుకులు పంపిణీచేశారు. దీనిపై రాచకొండ సీపీ మహేశ్‌భగవత్‌ పోస్ట్‌చేసిన ట్వీట్‌ను రీట్వీట్‌చేశారు. ‘నా సూచనలతో ముందుకొచ్చి వృద్ధాశ్రమాన్ని దత్తత తీసుకోవడం సంతోషం. వెల్‌డన్‌ రాచకొండ పోలీస్‌. మన పనులే  చెప్తాయి మనం అంటే ఏమిటో.. ఇలాంటి చర్యలే సమాజంలో మార్పును తెచ్చేవి’ అని డీజీపీ పేర్కొన్నారు.logo