శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Jul 27, 2020 , 18:47:48

అనంతగిరిని దత్తత తీసుకుంటా : ఎంపీ రంజిత్ రెడ్డి

అనంతగిరిని దత్తత తీసుకుంటా : ఎంపీ రంజిత్ రెడ్డి

వికారాబాద్ : ప్రకృతి అందాలకు నెలవైన అనంతగిరిని దత్తత తీసుకొని.. పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. అనంతగిరి ఫారెస్ట్ డెవలప్ మెంట్ కోసం ఎంపీ, డీఎఫ్ వో వేణుమాధవ రావుతో కలిసి అనంతగిరిలో పర్యటించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనంతగిరి ఇప్పుడిప్పుడే అభివృద్ధి  చెందుతున్నది. హైదరాబాద్ నగరానికి దగ్గరలో వుండి అభివృద్ధికి నోచుకోక పోవడం దురదృష్టకరం అన్నారు. ఇక నుంచి ఈ ప్రాంతాన్ని దత్తత తీసుకొని పర్యాటకంగా అభివృద్ధి చేస్తానని రంజిత్ రెడ్డి అన్నారు.


logo