శనివారం 11 జూలై 2020
Telangana - Jun 23, 2020 , 01:12:47

బీసీ గురుకుల కళాశాలల్లో ప్రవేశాలు

బీసీ గురుకుల కళాశాలల్లో ప్రవేశాలు

  • జూలై 12 వరకు దరఖాస్తుల స్వీకరణ 

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణలోని బీసీ రెసిడెన్షియల్ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో అర్హత పరీక్ష ద్వారా ప్రవేశానికి విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ కార్యదర్శి మల్లయ్యభట్టు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 19 మహాత్మాజ్యోతిబాపూలే బీసీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో 3040, ఒక మహిళా డ్రిగీ కళాశాలలో 320 సీట్లు భర్తీ చేయనున్నామని పేర్కొన్నారు. విద్యార్థులు జూలై 12 వరకు ఆన్ దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. వివరాల కోసం mjptbcwreis.telangana.gov.in, mjptbcwreis.cgg.gov.in వెబ్ పరిశీలించవచ్చని తెలిపారు. ఆంగ్ల మాధ్యమంలో నిర్వహించే అర్హత పరీక్షకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులకు అవకాశం కల్పించనున్నట్టు పేర్కొన్నారు. బీసీలకు 75 శాతం, ఎస్సీలకు 15, ఎస్టీలకు 5, ఈబీసీలకు 2, ఆర్ఫాన్స్ 3 శాతం సీట్లు కేటాయించనున్నట్టు వెల్లడించారు. 


logo