మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Aug 09, 2020 , 07:15:37

స్పోర్ట్స్‌ స్కూళ్లలో 220 సీట్లు.. దరఖాస్తుకు 18 వరకు గడువు

స్పోర్ట్స్‌ స్కూళ్లలో 220 సీట్లు.. దరఖాస్తుకు 18 వరకు గడువు

హైద‌రాబాద్‌‌: రాష్ట్రం‌లోని గిరి‌జన గురు‌కుల విద్యా‌సం‌స్థల్లో స్పోర్ట్స్‌ అకా‌డ‌మీ‌ల‌తో‌పాటు 2 స్పోర్ట్స్‌ స్కూల్స్‌, 2 క్రికెట్‌ అకా‌డ‌మీ‌లను ఈ విద్యా‌సం‌వ‌త్సరం నుంచి ప్రారం‌భిం‌చ‌ను‌న్నారు. మినీ స్పోర్ట్స్‌ అకా‌డ‌మీల్లో అడ్మి‌షన్ల కోసం తెలం‌గాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసి‌డె‌న్షి‌యల్‌ ఎడ్యు‌కే‌షన్ ఇన్‌‌స్టి‌ట్యూ‌షన్స్‌ సొసైటీ నోటి‌ఫి‌కే‌షన్‌ విడు‌దల చేసింది. దీనిద్వారా మినీ స్పోర్ట్స్‌ అకా‌డ‌మీలు, స్పోర్ట్స్‌ స్కూల్స్‌లో 220 సీట్లు భర్తీ చేయ‌ను‌న్నారు. తెలం‌గాణ గిరి‌జన మినీ స్పోర్ట్స్‌ అకా‌డ‌మీల్లో 5 నుంచి 8 వ తర‌గతి వరకు, స్పోర్ట్స్‌ స్కూళ్ల‌లో 5వ తర‌గతి వారికి మాత్రమే అడ్మి‌షన్ల ప్రక్రియ చేప‌ట్ట‌ను‌న్నారు. 

మొత్తం సీట్లు: 220 

ప్ర‌వేశాలు: ‌మినీ స్పోర్ట్స్‌ అకా‌డ‌మీల్లో 5 నుంచి 8వ తర‌గతి వరకు, స్పోర్ట్స్‌ స్కూళ్ల‌లో 5వ త‌ర‌గ‌తిలో

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ: ఆన్‌లైన్‌లో

ద‌ర‌ఖాస్తు ఫీజు: గిరి‌జన విద్యా‌ర్థుల‌కు రూ.50 

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: ఆగ‌స్టు 18

వెబ్‌‌సై‌ట్: WWW. tgtwgurukulam.tela ngana.co.in 

పూర్తి వివ‌రా‌లకు హెల్ప్‌‌డెస్క్ నంబ‌ర్లు: 91211 74434, 91213 33472


logo