హెచ్‌పీఎస్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

హైదరాబాద్: బేగంపేట్, రామంతాపూర్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూలులో ఎస్సీ కోటాలో ఒకటో తరగతిలో ప్రవేశాలను పొందగోరే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ మే రకు హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి మం గళవారం వెల్లడించారు. ఎస్సీ కోటాలో 2 సీట్ల ను కేటాయించినట్లు వివరించారు. హైదరాబాద్ జిల్లా వాస్తవ్యులై, జూన్ 1, 2015 నుంచి మే 31 2016 మధ్య కాలంలో అభ్యర్థి జన్మించి ఉండాలని, తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.2 లక్షల లోపున్న ఎస్సీ చిన్నారులు ప్రవేశాలకు అర్హులని వెల్లడించారు. అర్హులైన వారు పుట్టినతేదీ ధ్రువీకరణ పత్రం, కులం, ఆదాయం, స్థాని క ధ్రువీకరణ పత్రాలతో మార్చి 3లోగా దరఖా స్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తారని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వివరాలకు నాంపల్లి చంద్ర విహార్‌లోని జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
మేడ్చల్ జిల్లా విద్యార్థుల కోసం....
నగరంలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగంపేట్, రామంతాపూర్ బ్రాంచిలలో 2021-22వ సంవత్సరానికి 1వ తరగతిలో ప్రవేశానికి షెడ్యూల్ కులాల బాల బాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి జి.వినోద్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్లోని షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయంలో దరఖాస్తు ఫారములు లభిస్తాయని, పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 27 సాయం త్రం నాలుగు గంటలలోపు సమర్పించాలన్నా రు. షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ వారిచే స్పాన్సర్ చేయబడిన విద్యార్థులకు మాత్రమే ఉపకార వేతనము చెల్లిస్తామని, తమంతట తాము పాఠశాలకు దరఖాస్తు చేసుకున్నచో వారికి ఉపకార వేతనము చెల్లించమని తెలిపారు. మార్చి 3న మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్లోని ప్రజావాణి హాల్లో డ్రా తీయడం జరుగుతుందన్నారు.
నిబంధనలు ఇవీ..
- అభ్యర్థులు మేడ్చల్ - మల్కాజ్గిరి జిల్లా వాస్తవ్యులై ఉండాలి.
- తల్లిదండ్రులు వార్షిక ఆదాయం గ్రామీణ పాంత్రాలలో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాలలో రూ.2 లక్షలలోపు ఉండాలి.
- ఆదాయ, నివాస, కులం మరియు జనన ధ్రువీకరణ పత్రములు సంబంధిత తహసీల్దార్లు జారీ చేయబడినవై ఉండాలి.
- అభ్యర్థులు తేది: 01-06-2015 నుంచి తేది: 31-05-2016ల మధ్య జన్మించిన వారై ఉండాలి.
- కుటుంబంలో ఒకరు మాత్రమే దరఖాస్తు చేసుకొనుటకు అర్హులు.
తాజావార్తలు
- మోదీ ర్యాలీలో గంగూలీ.. ఆయన ఇష్టమన్న బీజేపీ
- ఎములాడ రాజన్న.. మోదీ మనసు మార్చు
- చంద్రుడిని చుట్టొద్దాం.. దరఖాస్తు చేసుకోండి
- శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత
- తప్పుకున్న నీరా టండన్.. బైడెన్‌కు చుక్కెదురు
- దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
- అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది దుర్మరణం
- శంషాబాద్ విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం
- 9 నుంచి ఇంద్రకీలాద్రిపై మహాశివరాత్రి ఉత్సవాలు
- ఇన్నోవేషన్స్ సమాజంపై ప్రభావం చూపాలి : పీయూష్ గోయల్