మంగళవారం 07 ఏప్రిల్ 2020
Telangana - Mar 15, 2020 , 07:35:57

ఇగ్నో పీహెచ్‌డీ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలు

ఇగ్నో పీహెచ్‌డీ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలు

హైదరాబాద్‌: ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో)లో మేనేజ్‌మెంట్‌, పీహెచ్‌డీ ప్రొగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇగ్నో ప్రాంతీయ కేంద్రం సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు. 2020 జూలై సెషన్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 23వ తేదీలోపు ఆన్‌లైన్‌లో https://ignouexams.nta.nic.in/WebInfo/Public/Home.aspx వెబ్‌సైట్‌లో సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుదారులకు ఏప్రిల్‌ 29న జాతీయ వ్యాప్తంగా నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ద్వారా ప్రవేశపరీక్షను నిర్వహించనున్నామన్నారు. ఇతర వివరాల కోసం 94924 5181 2, 040-23117550నంబర్లను సం ప్రదించాలన్నారు.logo