శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Jan 03, 2021 , 17:03:48

పరిపాలన దక్షకుడు మంత్రి కేటీఆర్‌

పరిపాలన దక్షకుడు మంత్రి కేటీఆర్‌

నల్లగొండ : భగవంతుని కృప, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో కేటీఆర్ ఎప్పుడైనా ముఖ్యమంత్రి అవ్వొచ్చు అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. పరిపాలన దక్షకుడు మంత్రి కేటీఆర్‌ అని ప్రశంసించారు. నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయ నూతన ధర్మకర్తల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదటగా నూతన చైర్మన్ మేకల అరుణ రాజిరెడ్డి, ధర్మకర్తలతో ప్రమాణ స్వీకారం చేయించారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వ ఆదేశాల మేరకు నూతన కమిటీ నియామకం జరిగిందన్నారు. చెర్వుగట్టు దేవాలయం చాలా పవిత్రమైంది. పది సంవత్సరాల కాలంలో  ఆలయ అభివృద్ధికి పాటుపడ్డామన్నారు. ఉదయ సముద్రం, ధర్మారెడ్డిపల్లి, పిల్లాయిపల్లి కాలువలకు నిధుల మంజూరుకు ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. 


logo