ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Telangana - Sep 07, 2020 , 09:18:48

క‌రోనాతో ఆదిలాబాద్ జెడ్పీ వైస్ చైర్మన్ మృతి

క‌రోనాతో ఆదిలాబాద్ జెడ్పీ వైస్ చైర్మన్ మృతి

ఆదిలాబాద్‌: జిల్లాప‌రిష‌త్ వైస్ చైర్మ‌న్‌ ఆరె రాజ‌న్న క‌రోనాతో మృతిచెందారు. క‌రోనా బారిన‌ప‌డిన ఆయ‌న‌ గ‌త కొన్నిరోజులుగా హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ద‌వాఖాన‌లో చికిత్స పొందుతున్నారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఈరోజు ఉద‌యం మ‌ర‌ణించారు. 

క‌రోనా సోక‌డంతో ఆదిలాబాద్‌లోని ఓ ప్రైవేటు ద‌వాఖాన‌లో మూడురోజుపాటు చికిత్స పొందారు. వ్యాధి తీవ్ర‌త అధిక‌మ‌వ‌డంతో న‌గ‌రంలోని ఓ ద‌వాఖాన‌లో చేశారు. 

ఆరె రాజ‌న్న మృతిప‌ట్ల రాష్ట్ర మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి సంతాపం తెలిపారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ఆకాంక్షించారు. రాజ‌న్న‌ కుటుంబ సభ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.  


logo