శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Mar 31, 2020 , 18:32:03

అడ్డుకుంటున్నారని దారి మార్చి గంగమ్మ వెంట కూలీల నడక

అడ్డుకుంటున్నారని దారి మార్చి గంగమ్మ వెంట కూలీల నడక

ఆదిలాబాద్‌: హైదరాబాద్‌లో వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్న రాజస్థాన్‌కు చెందిన వలస కూలీలు సొంతగ్రామాలకు ప్రయాణమయ్యారు. 350 కిలోమీటర్లు నడుస్తూ వచ్చిన కూలీలను మహారాష్ట్ర సరిహద్దు బొల్లారం వద్ద అడ్డుకుంటున్నారని వారికి తెలియడంతో దారి మార్చి పెన్‌గంగలో దిగి నడుస్తున్నారు. నదిలో నీరు లేకపోవడంతో కొంతదూరం వెళ్లిన వీరిని గుర్తించిన స్థానిక గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన పెన్‌గంగా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకుని అక్కడే నివాసం ఏర్పాటు చేస్తాం ఎక్కడికి వెళ్లవద్దని నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కూలీల వద్దకు చేరుకున్న కలెక్టర్‌ కరోనా వైరస్‌ గురించి వారికి వివరించి సొంత ప్రాంతాలకు వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు. వారికి సదుపాయం, భోజనం ఏర్పాటు చేయాలని సిబ్బందికి కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. 


logo