శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Aug 23, 2020 , 13:57:26

రైతులకు సరిపడా అందుబాటులో ఎరువులు

రైతులకు సరిపడా అందుబాటులో ఎరువులు

వరంగల్ రూరల్ : జిల్లాలోని గీసుగొండ మండలం మనుగొండ గ్రామంలో ఓడీసీఎం ఎస్ కేంద్రాన్ని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండటానికి ముందస్తుగా ఎరువులను నిల్వ ఉంచేందుకు ఈ కేంద్రాన్ని ప్రారంభించామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించారన్నారు. గత ప్రభుత్వంలో రైతులు ఎరువుల కోసం పడిగాపులు పడ్డారని పేర్కొన్నారు.

ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎదురు కావొద్దనే ఉద్దేశంతో ముందస్తుగా ఎరువుల కేంద్రాన్నిఏర్పాటు చేసినట్లు చెప్పారు. రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉండటానికి ప్రతి నాలుగు గ్రామాలకు కలిపి ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశామని వివరించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వరంగల్ రూరల్ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర రావు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


logo