ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Telangana - Jan 27, 2021 , 17:48:09

బీజేపీ, బీఎస్పీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరికలు

బీజేపీ, బీఎస్పీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరికలు

నిజామాబాద్‌ :  టీఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా జిల్లాలోని భీమ్‌గల్‌ మండలంలోని భీమ్‌గల్‌, బడా భీమ్‌గల్‌కు చెందిన 60 మంది యువకులు బీఎస్పీ, బీజేపీల నుంచి రోడ్లు, భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సమక్షంలో హైదరాబాద్‌లో  టీఆర్‌ఎస్‌లో చేరారు. భీమ్‌గల్‌ నుంచి అభినవ్‌ గౌడ్‌, బడా భీమ్‌గల్‌ నుంచి గణేశ్‌ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు, భీమ్‌గల్‌ పట్టణానికి చెందిన బీఎస్పీ నాయకుడు బొదిరే సుమన్‌తో పాటు నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరికి గులాబీ కండువాలు కప్పి మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు.  

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పెద్ద ఎత్తున యువకులు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పయనిస్తున్నదని, సోషల్‌ మీడియాలో ఇతర పార్టీలు చేసే దుష్ప్రచారాలను తిప్పి కొట్టాలన్నారు. తెలంగాణ యువకులు విజ్ఞులని ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పాలన్నారు. 

కార్యక్రమంలో ఎంపీపీ మహేశ్‌, బడా భీమ్‌గల్‌ సర్పంచ్‌ సంజీవ్‌, పార్టీ సీనియర్‌ నాయకులు గుణ్‌వీర్‌ రెడ్డి, బద్రీ, పిట్ల దాస్‌, శంకర్‌గౌడ్‌, కిషన్‌, భూమేశ్వర్‌, శ్రీను, బాల్‌రాజ్‌, కార్తీక్‌, రాగుల మోహన్‌, మాజీ సర్పంచ్‌ గణేశ్‌,  కౌన్సిలర్‌ బొదిరే నర్సయ్య, నీలం రవి, బడా భీమ్‌గల్‌ ఉపసర్పంచ్‌ బాల్‌రెడ్డి, రాము, సునీల్‌, నారాయణ, గోపి, శ్రీకాంత్‌ తదితరులు ఉన్నారు.  

ఇవి కూడా చదవండి..

అనర్హులకు ఇండ్లు కేటాయిస్తే కఠిన చర్యలు : స్పీకర్‌ పోచారం

తెలంగాణ అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం 

ఉనికి కోసమే ఉత్తమ్ పాకులాట : ఎమ్మెల్యే శానంపూడి 

రోడ్డు ప్రమాదంలో సైకిలిస్ట్ మృతి

VIDEOS

logo