సోమవారం 18 జనవరి 2021
Telangana - Nov 29, 2020 , 16:24:08

అభివృద్ధిని చూసే టీఆర్‌ఎస్‌లో చేరికలు

అభివృద్ధిని చూసే టీఆర్‌ఎస్‌లో చేరికలు

రంగారెడ్డి : టీఆర్‌ఎస్‌ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసే పార్టీలే చేరుతున్నారని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ అన్నారు. కొత్తూరు, నందిగామ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తుందని చెప్పారు.

సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి అన్ని వర్గాల ప్రజలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని పేర్కొన్నారు. అందరి సమన్వయంలో ఉమ్మడి కొత్తూరు మండలాన్ని అభివృద్ధిలో ముందుంచుతామని చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌ వందకు పైగా డివిజన్లలో విజయఢంగా మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.