గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - Sep 30, 2020 , 12:35:50

అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే టీఆర్ఎస్ లో చేరికలు

అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే టీఆర్ఎస్ లో చేరికలు

సూర్యాపేట : టీఆర్ఎస్ లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా జిల్లాలోని జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలో వివిధ పార్టీలకు చెందిన 100 మంది నాయకులు, కార్యకర్తలు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. అందరూ కలిసి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే కిషోర్ కుమార్ సూచించారు. logo