శనివారం 26 సెప్టెంబర్ 2020
Telangana - Aug 25, 2020 , 17:58:02

అభివృద్ధిని చూసే టీఆర్ఎస్ లో చేరికలు : మంత్రి కొప్పుల

అభివృద్ధిని చూసే టీఆర్ఎస్ లో చేరికలు : మంత్రి కొప్పుల

జగిత్యాల : టీఆర్ఎస్ లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా జిల్లాలోని గొల్లపల్లి మండలం గోవిందుపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ముస్కు శంకరమ్మ, 50 మంది కార్యకర్తలతో కలిసి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ..రాష్ట్రంలో జరుగుతున్నఅభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసే పార్టీలో చేరుతున్నారన్నారు. అంతకు ముందు గ్రామంలో పది లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణం, రెడ్డి సంఘం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.logo