శనివారం 23 జనవరి 2021
Telangana - Jan 03, 2021 , 15:03:22

ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి అదనపు మాప్ అప్ కౌన్సిలింగ్

 ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి అదనపు మాప్ అప్ కౌన్సిలింగ్

వరంగల్ : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కళాశాల్లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి అదనపు మాప్ అప్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను కాళోజీ హెల్త్ యూనివర్సిటీ విడుదల చేసింది. ఈ నెల 4, 5వ తేదీల్లో వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నేడు నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఈ నెల 4న సాయింత్రం 5 గంటల నుంచి 5వ తేదీ రాత్రి 9 గంటల వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని వారు సూచించారు.

ఇప్పటికే యూనివర్సిటీ విడుదల చేసిన తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు ఈ  విడత వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. గత  విడత కౌన్సెలింగ్‌లో సీటు అలాట్ అయి జాయిన్ కానీ అభ్యర్థులు, అదే విధంగా కళాశాలలో చేరి డిస్కంటిన్యూ చేసిన అభ్యర్థులు ఈ విడత వెబ్ కౌన్సెలింగ్‌కు అనర్హులుగ పరిగణించబడుతారు. అలాగే ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ కింద ఇప్పటికే చేరిన అభ్యర్థులను కూడా ఈ వెబ్ కౌన్సెలింగ్‌కు అనర్హులు. ఇతర వివరాలకు www.knruhs.telangana.gov .in వెబ్ సైట్లో సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు  సూచింయి.


logo