శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Telangana - Jan 23, 2021 , 08:41:01

క‌బ‌డ్డీ.. క‌బ‌డ్డీ.. అద‌ర‌గొట్టెన్ అద‌న‌పు క‌లెక్ట‌ర్

క‌బ‌డ్డీ.. క‌బ‌డ్డీ.. అద‌ర‌గొట్టెన్ అద‌న‌పు క‌లెక్ట‌ర్

కరీంనగరంలోని అంబేద్కర్‌ స్టేడియంలో ప్రభుత్వోద్యోగుల జిల్లా స్థాయి క్రీడాపోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. శుక్రవారం కబడ్డీ పోటీలు నిర్వహించగా, పంచాయతీరాజ్‌, వ్యవసాయశాఖ జట్లు తలపడ్డాయి. వ్యవసాయశాఖ జట్టు తరఫున అదనపు కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌లాల్‌ ఆడి, ఔరా అనిపించారు. మొదటిసారి కూతకు వెళ్లిన ఆయన, బాల్క్‌ లైన్‌ను తొక్కి హైరానా పెట్టించారు. అంతలోనే డీపీవో వీరబుచ్చయ్య పట్టుకోవడంతో కిందపడిపోయిన శ్యాంప్రసాద్‌లాల్‌ను, మరో క్రీడాకారుడు వచ్చి పట్టుకునే ప్రయత్నం చేసినా మెరుపువేగంతో మిడ్‌లైన్‌పైకి దూసుకొచ్చారు. ఒకే సమయంలో ఇద్దరిని ఔట్‌ చేసి రెండు పాయింట్లు తీసుకున్నారు.

-స్టాప్ ఫోటోగ్రాఫ‌ర్‌, కరీంన‌గ‌ర్‌


VIDEOS

logo