మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 02, 2020 , 02:02:00

హరిత తెలంగాణ సీఎం కేసీఆర్‌ కల

హరిత తెలంగాణ సీఎం కేసీఆర్‌ కల

  • గ్రీన్‌ చాలెంజ్‌లో నటుడు ప్రకాశ్‌రాజ్‌ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: హరిత తెలంగాణ మా బాస్‌, సీఎం కేసీఆర్‌ కల అని నటుడు ప్రకాశ్‌రాజ్‌ పేర్కొన్నారు. తనికెళ్ల భరణి విసిరిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ను స్వీకరించిన ప్రకాశ్‌రాజ్‌ గురువారం షాద్‌నగర్‌లోని తన వ్యవసాయ క్షేత్రంలో కుమారుడితో కలిసి మొక్కలు నాటా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ చేపట్టిన హరితహారం కార్యక్రమంతో ఐదారేండ్లలో తెలంగాణ ఆకుపచ్చగా మారిందని చెప్పా రు. బంగారు తెలంగాణ తొందర్లోనే సాకారమవుతుందన్నారు. సీఎం కేసీఆర్‌, ఎంపీ సంతోష్‌ మట్టి మనుషు లని, మట్టితోవారికి అవినాభావ సం బంధమున్నదని, వారిద్దరూ మట్టితో మాట్లాడుతారని, మట్టికి చెట్టుకున్న అనుబంధంతో ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టారని కొనియాడారు.


logo