బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 03, 2020 , 11:33:28

సునీతా కృష్ణన్‌కు కరోనా నెగిటివ్‌

సునీతా కృష్ణన్‌కు కరోనా నెగిటివ్‌

హైదరాబాద్‌ : ప్రజ్వల సంస్థ వ్యవస్థాపకురాలు, మహిళల హక్కుల పోరాటకర్త సునీతా కృష్ణన్‌కు కరోనా వైరస్‌ సోకలేదని ఆమెకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో తేలింది. కరోనా వైరస్‌ లక్షణాలతో ఆమె సోమవారం గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో చేరారు. ఆమెకు నిర్వహించిన వైద్య పరీక్షల రిపోర్టు మంగళవారం వచ్చింది. ఈ మేరకు సునీతా కృష్ణన్‌ ట్వీట్‌ చేశారు. తనకు కరోనా వైరస్‌ పరీక్షా ఫలితం నెగిటివ్‌ వచ్చిందని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఫలితం నెగిటివ్‌ రావడంతో ఎంతో ఉపశమనం లభించిందని కృష్ణన్‌ తెలిపారు. తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి సునీతా కృష్ణన్‌ కృతజ్ఞతలు చెప్పారు.

ఇటీవలే బ్యాంకాక్‌ నుంచి వచ్చిన సునీతా కృష్ణన్‌కు దగ్గుతో బాధపడింది. దగ్గు ఎంతకీ తగ్గకపోవడంతో.. గాంధీ ఆస్పత్రిలో చేరానని నిన్న ఆమె ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. తన ఆరోగ్యంపై వస్తున్న ఎలాంటి పుకార్లు, నకిలీ వార్తలను నమ్మొద్దని కృష్ణన్‌ ట్విట్టర్‌ ద్వారా కోరారు. 


logo