శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Sep 11, 2020 , 14:38:33

ప్రైవేట్‌ కాలేజీలు సిబ్బందిని తొలగిస్తే చర్యలు : ఇంటర్‌ బోర్డు

ప్రైవేట్‌ కాలేజీలు సిబ్బందిని తొలగిస్తే చర్యలు : ఇంటర్‌ బోర్డు

హైదరాబాద్‌ : ప్రైవేట్‌ కాలేజీలు తమ సిబ్బందిని తొలగిస్తే చర్యలు తప్పవని రాష్ట్ర ఇంటర్మీడియట్‌ బోర్డు హెచ్చరించింది. సిబ్బందిని తొలగించిన కాలేజీలపై ఎపిడెమిక్‌ యాక్ట్‌ ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపింది. నిబంధనల మేరకు సిబ్బంది లేకపోతే కాలేజీల గుర్తింపు దరఖాస్తులను తిరస్కరించనున్నట్లు వెల్లడించింది.

జూనియర్‌ కాలేజీల అకడమిక్‌ క్యాలెండర్‌ను తెలంగాణ ఇంటర్‌బోర్డు నిన్న విడుదల చేసింది. కరోనా దృష్ట్యా విద్యాసంవత్సరం పనిదినాలను 220 రోజులకు బదులు 182 రోజులుగా పేర్కొంది. ఈ నెల 1వ తేదీ నుంచి విద్యాసంవత్సరం ప్రారంభమైనట్లుగా తెలిపింది. లాస్ట్‌ వర్కింగ్‌ డే ఏప్రిల్‌ 16.


logo