ప్రభుత్వమిచ్చిన ఇంటిని అమ్మితే కేసు: హరీశ్ రావు

సిద్దిపేట: మనిషికి అతి ముఖ్యమైన ఇల్లు, పెళ్లికి తెలంగాణ ప్రభుత్వం సహాయం చేస్తున్నదని మంత్రి హరీశ్ రావు అన్నారు. రెండు పడక గదుల ఇళ్లు పేదవారి కల అని, ఆ కలను సీఎం కేసీఆర్ సాకారం చేస్తున్నారని వెల్లడించారు. సిద్దిపేటలోని కేసీఆర్ కాలనీలో మరో 168 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తయ్యింది. వాటికి సంబంధించిన పట్టాలను లబ్దిదారులకు మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉద్యోగి ఇల్లు నిర్మించుకున్నా.. కొంత అప్పు అవుతుంది. ఎలాంటి అప్పు లేకుండానే పేదవారికి ఇంటి కలను సీఎం నెరవేరుస్తున్నారని చెప్పారు. అనర్హులు ఇల్లు తీసుకుంటే మరో పేదవాడికి అన్యాయం చేసినట్లేనని పేర్కొన్నారు. తనను విమర్శించిన బీజేపీ కార్యకర్తకు కూడా ఇల్లు వచ్చిందన్నారు. ఎవరైనా ప్రభుత్వమిచ్చిన ఇల్లును విక్రయిస్తే కేసు నమోదుచేస్తామని హెచ్చరించారు.
సిద్దిపేట చర్చ్‌లో ప్రత్యేక ప్రార్థనలు
అంతకుముందు సిద్దిపేట చర్చ్‌లో మంత్రి హరీశ్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతి వెళ్లాలని, దీంతో క్రిస్మస్ పర్వదినాన చర్చ్‌కి రాలేకపోయానని చెప్పారు. క్రిస్మస్ మాసంలో మొదటి ఆదివారం కావడంతో ఈరోజు చర్చ్‌కు వచ్చానని చెప్పారు. క్రిస్టియన్ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు బోధించిన దయ, కరుణ, ప్రేమ ప్రపంచ మానవాళికి మార్గదర్శకాలని అన్నారు. మనమంతా సుఖ శాంతులతో జీవించాలంటే క్రీస్తు బోధనలను ఆచరించాలని చెప్పారు. క్రిస్మస్ పండగకు కానుకలు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు.
తాజావార్తలు
- నేనొచ్చింది నా మనసులో మాట చెప్పేందుకు కాదు: రాహుల్‌గాంధీ
- అమెజాన్ క్విజ్.. ఫ్రీగా ఐఫోన్12.. ఇవీ సమాధానాలు
- 241 ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్
- ఇంధన ధరల పెరుగుదలపై కేంద్రంపై రాహుల్ ఆగ్రహం
- టీమిండియాను సర్కస్‌లో జంతువులలాగా చూశారు!
- 28న WEF సదస్సులో ప్రధాని ప్రసంగం..!
- కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ.. 14 మంది అరెస్ట్
- ఢిల్లీలో పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు.. ఎవరు వాళ్లు?
- వ్యాక్సిన్ తీసుకున్న ఆశావర్కర్ మృతి
- పటాన్చెరులో ఏటీఎం చోరీకి విఫలయత్నం