గురువారం 28 మే 2020
Telangana - May 13, 2020 , 20:40:29

750 మందిపై అనర్హత వేటు

750 మందిపై అనర్హత వేటు

హైదరాబాద్‌: గత ఏడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసి ఖర్చుల వివరాలు ఇవ్వని వారిపై అనర్హత వేటువేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇప్పటికే ఆరు జిల్లాల్లో లెక్క చెప్పనివారి వివరాలు సేకరించింది. ములుగు, రాజన్న సిరిసిల్ల, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, పెద్దపల్లి జిల్లాల్లో 860 మంది సర్పంచ్‌‌, 8,784 మంది వార్డులు, 624 మంది ఎంపీటీసీ, 65 మంది జెడ్పీటీసీ స్థానాలకు పోటీచేసినవారు ప్రచార ఖర్చుల వివరాలు ఈసీకి సమర్పించలేదు. వీరిలో గెలిచిన 45 మంది సర్పంచ్‌లు, 480 మంది వార్డు, 160 మంది ఎంపీటీసీ, 65 మంది జెడ్పీటీసీ సభ్యులు మొత్తం 750 మందిపై అనర్హత వేటు వేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు పంచాయత్‌రాజ్‌శాఖకు సంబంధిత పత్రాలను పంపించినట్టు సమాచారం. మిగతా జిల్లాల్లోనూ ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి ఎం అశోక్‌ తెలిపారు. 


logo