వివాహితపై యాసిడ్ దాడి

- నడుచుకుంటూ వెళ్తుండగా దుండగుడి దుశ్చర్య
- మహిళకు తీవ్ర గాయాలు.. దవాఖానకు తరలింపు
- జగిత్యాల జిల్లా తిమ్మాపూర్ తండాలో కలకలం
ఇబ్రహీంపట్నం: భర్తను కోల్పోయిన పుట్టెడు దుఖం ఆమెది. అయినా మొండి ధైర్యంతో ఐదేండ్లలోపున్న ఇద్దరు పిల్లలను సాకుతున్నది. అలాంటి ఆమె జీవితంపై యాసిడ్ దాడి రూపంలో మరో దెబ్బతగిలింది. ఓ దుండగుడి దుశ్చర్యతో యాసిడ్ దాడిలో ఆమె సగం ముఖం కాలిపోయింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని తిమ్మాపూర్ తండాలో బుధవారం రాత్రి కలకలం రేపింది. తండాకు చెందిన మహిళ తన చెల్లితో కలిసి మెట్‌పల్లికి వెళ్లింది. సాయం త్రం 6.30 గంటల ప్రాంతంలో ఆటోలో తండాకు తిరిగొచ్చి ఇంటికి నడిచి వెళ్తున్నది. అదే సమయంలో పక్కన నర్సరీలో నుంచి హెల్మెట్ పెట్టుకొని వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి.. మహిళపై యాసిడ్ దాడిచేశాడు. తర్వాత ద్విచక్రవాహంపై పరారయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ బాధితురాలిని స్థానికులు మెట్‌పల్లిలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడనుంచి మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్‌కు తీసుకెళ్లారు. ఘటనాస్థలిని ఎస్పీ సింధూశర్మ పరిశీలించారు. బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. దాడికి గల కారణాలు తెలియరాలేదు. కాగా, బాధితురాలి భర్త 7 నెలల కిందటే అనారోగ్యంతో మృతి చెందాడు. ఆమెకు కూతురు, కొడుకు ఉన్నారు.
దాడి ఘటన దురదృష్టకరం: ఎమ్మెల్సీ కవిత
తిమ్మాపూర్ తండాలో మహిళపై యాసిడ్ దాడి ఘటన దురదృష్టకరమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ ఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. బాధితురాలికి జరిగిన నష్టం పూడ్చలేనిదని చెప్పారు. ఆమెకు సత్వర న్యాయం జరిగేలా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని జగిత్యాల ఎస్పీతో మాట్లాడానని తెలిపారు. మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశిస్తూ బాధితురాలికి భరోసా ఇచ్చారు.
తాజావార్తలు
- ఎస్ఈసీకి సీఎస్ ఆదిత్యానాథ్ మూడు పేజీల లేఖ
- కన్న తల్లిని కొట్టి చంపిన తనయుడు
- 24న వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులతో సీఎం సమీక్ష
- ట్రంప్ వాడే ‘రెడ్ బటన్’ తొలగించిన బైడెన్
- జిల్లా డైరెక్టర్ తో రామ్ నెక్ట్స్ మూవీ..!
- ఇద్దరు మావోయిస్టు కొరియర్ల అరెస్ట్
- ఫిబ్రవరి 18న ఐపీఎల్ వేలం!
- ఆ బుల్లెట్ ఎవరిదో తెలిసిపోయింది..!
- అలాగైతే ప్రజాస్వామ్యానికి తీరనిముప్పు: బాంబే హైకోర్టు సంచలనం
- యజమాని కోసం ఆసుపత్రి వద్ద కుక్క నిరీక్షణ