ఆరేండ్ల అనతి కాలంలోనే అద్భుతాల ఆవిష్కరణ

Sep 25, 2020 , 17:54:17

హైదరాబాద్ : రాష్ట్రంలో ఆరేండ్ల అనతి కాలంలోనే జల విప్లవాన్ని సాధించామని, నీటి భద్రతకు స్థిరమైన పరిష్కారం చూపామని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ వెల్లడించారు.శుక్రవారం కాన్ఫిడిరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ( సీ.ఐ.ఐ ) ‘వాటర్ సెక్యూరిటీ త్రూ సస్టేనేబుల్ సొల్యూషన్స్’ అనే అంశంపై నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల వర్చువల్ కాన్ఫరెన్స్ లో వినోద్ కుమార్ ప్రారంభ ఉపన్యాసం చేశారు.

నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో స్వరాష్ట్ర సాధన కోసం తెలంగాణ ఉద్యమం సాగిందన్నారు. కొత్త రాష్ట్రంలో ఆరేండ్ల కాలంలోనే నీటి పారుదల రంగంలో సాధించిన విప్లవాత్మక విజయాలపై ఈ వర్చువల్ కాన్ఫరెన్స్ లో వినోద్ కుమార్ సవివరంగా నివేదికను సమర్పించారు. సాగు నీరు, తద్వారా వ్యవసాయ రంగంలో సాధించిన ప్రగతిని వివరించారు. నూతన రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రణాళికా బద్ధంగా కార్యాచరణను రూపొందించాం.

పకడ్బందీగా అమలు చేయడంతో రాష్ట్రం ప్రస్తుతం సుసంపన్నంగా, సస్యశ్యామలంగా మారిందని పేర్కొన్నారు. ఆరేండ్లలోనే పలు రంగాల్లో ముఖ్యంగా నీటి పారుదల విభాగంలో యావత్ దేశానికి తెలంగాణ రాష్ట్రం మార్గదర్శకంగా నిలిచిందని ఆయన తెలిపారు. నీటి పారుదల రంగంలో అపార ప్రగతిని సాధించినట్లు వినోద్ కుమార్ స్పష్టం చేశారు.

తాజావార్తలు

ట్రెండింగ్

THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD