శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 09, 2020 , 03:32:54

తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షుడిగా ఎల్లూరి శివారెడ్డి

తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షుడిగా ఎల్లూరి శివారెడ్డి

తెలుగుయూనివర్సిటీ : తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షుడిగా ఆచార్య ఎల్లూరి శివారెడ్డి తిరిగి ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని బొగ్గులకుంట తిలక్‌రోడ్డు లో బుధవారం తెలంగాణ సారస్వత పరిషత్తు ట్రస్టు, కార్యవర్గ, సర్వ సభ్యమండలి సమావేశం లో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షపదవికి గడిచిన మూడేండ్ల లో పరిషత్తును అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన ఎల్లూరి శివారెడ్డి పేరును.. ఉపాధ్యక్షుడు, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి ప్రతిపాదించారు. ఈ మేరకు సభ్యులు హర్షధ్వానాలతో ఆమోదం తెలిపారు. అనంతరం అధ్యక్షుడు ఎల్లూరి శివారెడ్డి నూతన కార్యవర్గాన్ని ఏర్పాటుచేశారు.

ఉపాధ్యక్షులుగా డాక్టర్‌ కేవీ రమణాచారి, డాక్టర్‌ ముదిగంటి సుజాతారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్‌ జే చెన్నయ్య, కోశాధికారిగా మంత్రి రామారావు, పరీక్షల కార్యదర్శిగా మసన చెన్నప్ప, కార్యవర్గ సభ్యులుగా ఆచార్య రవ్వా శ్రీహరి, డాక్టర్‌ సీ వసుంధర, ఆచార్య ఎస్వీ రామారావు, ఎన్‌ఆర్‌ వెంకటేశం, జీ చెన్నకేశవరెడ్డి, రావికంటి వసునందన్‌, డాక్టర్‌ తిరుమల శ్రీనివాసాచార్య, ఎం నరహరి, డాక్టర్‌ డీ చంద్రశేఖరరెడ్డి, ఏటీవీ కృష్ణమాచార్యులు,వర్థమాను వెంకటయ్యను తిరిగి నియమించారు. కొత్తగా డాక్టర్‌ సురవరం కృష్ణవర్ధన్‌రెడ్డి, రింగు రామ్మూర్తి కార్యవర్గసభ్యులుగా నియమితులయ్యారు. ఈ కార్యవర్గం ఐదేండ్లపాటు కొనసాగుతుందని అధ్యక్షుడు శివారెడ్డి వెల్లడించారు.


logo