e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home తెలంగాణ తిన్నది అరగడం లేదు!

తిన్నది అరగడం లేదు!

తిన్నది అరగడం లేదు!
  • 56% కుటుంబాల్లో జీర్ణ సమస్యలు
  • ఆశీర్వాద్‌ ఆటా సర్వేలో వెల్లడి

హైదరాబాద్‌ సిటీబ్యూరో, మే 28 (నమస్తేతెలంగాణ): దేశంలోని 56 శాతం కుటుంబాలు జీర్ణశక్తి సమస్యను ఎదుర్కొంటున్నాయని ఆశీర్వాద్‌ ఆటా సంస్థ వెల్లడించింది. ‘మామ్స్‌ ప్రెస్సో సంస్థతో కలిసి నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైనట్టు తెలిపింది. వరల్డ్‌ డైజెస్టివ్‌ హెల్త్‌డే-2021ని పురస్కరించుకొని మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నైలలో సర్వే నిర్వహించారు. ఈ సర్వే కోసం 25 నుంచి 45 ఏండ్ల మధ్యనున్న 538మంది వివిధ రంగాల మహిళలను ఎంచుకున్నారు. వారి జీవనశైలి, ఆహారపు అలవాట్లను ఆధారంగా సర్వే ఫలితాలను వెల్లడించారు. 56 శాతంమంది మహిళలు త మ కుటుంబసభ్యుల్లో జీర్ణశక్తికి సంబంధించిన రెండుమూడు రకాల సమస్యలున్నాయని చెప్పారని పేర్కొన్నారు. గోధుమ ఆధారిత ఉత్పత్తులు, తృణధాన్యాలు తదితర ఫైబర్‌ ఎక్కువుండే ఆ హారంతో జీర్ణక్రియను మెరుగుపర్చుకునే ప్రయత్నంచేస్తున్నామని సర్వేలో ప లువురు చెప్పారని ఐటీసీ లిమిటెడ్‌ ఫు డ్‌ డివిజన్‌కు చెందిన చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ గణేశ్‌కుమార్‌ సుందరరామన్‌ తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తిన్నది అరగడం లేదు!

ట్రెండింగ్‌

Advertisement