Telangana
- Dec 28, 2020 , 10:27:55
పొగమంచు ఎఫెక్ట్.. ఆగివున్న లారీని ఢీకొట్టిన డీసీఎం

మూసాపేట: దట్టమైన పొగమంచు కారణంగా వాహణాలు ప్రమాదాల బారినపడుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున ములుగు జిల్లా తాడ్వాయి సమీపంలో ఆగివున్న లారీని ఓ కారు ఢీకొట్టింది. ఇలాంటి ఘటనే బెంగళూరు జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న లారీ టైర్ పంచర్ అయ్యింది. దీంతో రోడ్డు పక్కన లారీని ఆపిన డ్రైవర్.. దాని టైర్‌ను మార్చుతున్నాడు. ఈ క్రమంలో కర్నూలు వైపు వెళ్తున్న ఓ డీసీఎం వెనుక నుంచి ఆ లారీని ఢీకొట్టింది. దీంతో డీసీఎం డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంతో బెంగళూరు జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఆ వాహనాలను పక్కకు తొలగించారు. వాహనాల రాకపోకలను క్లియర్ చేశారు. జాతీయరహదారిపై మంచు బాగా కమ్ముకోవడంతో ముందున్న వాహనం కనిపించకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
- వ్యాక్సిన్ల సామర్థ్యంపై బ్రిటన్ మంత్రి హెచ్చరిక
- కాలా గాజర్.. ఆరోగ్య సమస్యలు పరార్
- ఎస్సీ, ఎస్టీలకు ఇంటింటికి కొత్త పథకం : మంత్రి ఎర్రబెల్లి
- శ్రీష్టి గోస్వామి.. ఒక్క రోజు సీఎం
- బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే మసీదులు కూల్చడం ఖాయం
- ఇంటర్ విద్యార్థిని అదృశ్యం..
- గణతంత్ర దినోత్సవ అతిథులకు అభినందనలు : మంత్రి
- క్రికెట్ ఆడిన సీపీ సజ్జనార్
- విజయ్ దేవరకొండ లైగర్ షూట్ షురూ ..వీడియో
- 'గాలి సంపత్` విడుదల తేదీ ఖరారు
MOST READ
TRENDING