ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 12, 2020 , 08:27:16

వ‌ర్ధ‌న్న‌పేట‌లో లారీ బీభ‌త్సం.. వ్య‌క్తి మృతి, ముగ్గురికి గాయాలు

వ‌ర్ధ‌న్న‌పేట‌లో లారీ బీభ‌త్సం.. వ్య‌క్తి మృతి, ముగ్గురికి గాయాలు

వ‌రంగ‌ల్ రూర‌ల్‌: జిల్లాలోని వరంగల్- ఖమ్మం రోడ్డులో ఓ లారీ బీభ‌త్సం సృష్టించింది. వేగంగా వ‌చ్చిన లారీ ఆటో, మోట‌ర్ సైకిళ్ల‌ను ఢీకొట్టింది. దీంతో ఓ వ్య‌క్తి అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించ‌గా, మ‌రో ముగ్గురు గాయ‌పడ్డారు. వ‌ర్ధ‌న్న‌పేట మండ‌లం కట్ర్యాల గ్రామ స‌మీపంలో ఈరోజు ఉద‌యం బైక్‌, ఆటోల‌ను ఓలారీ ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో బైక్‌పై వెళ్తున్న యువకుడు శ్రీరాముల నాగరాజు (32) అక్కడికక్కడే మృతి. ఆటోలో ఉన్న ముగ్గురికి గాయాలు. క్ష‌త‌గాత్రుల‌ను ఎంజీఎం ద‌వాఖాన‌కు తరలించారు. ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు కాలీ డ్రైవ‌ర్‌పై కేసు న‌మోదు చేశారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo