ఆడుకునేందుకు వెళ్లి.. మృత్యుఒడికి

- ట్రాక్టర్ కిందపడి బాలుడి దుర్మరణం
శాలిగౌరారం, జనవరి 10: స్నేహితులతో ఆడుకునేందుకు వెళ్లిన బాలుడు అంతలోనే మృత్యుఒడికి చేరాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని ఆకారం గ్రామంలో ఆదివారం చోటుచేసు కున్నది. గ్రామానికి చెందిన నాగమ్మ కుమారుడు వినయ్‌కుమార్(9) తోటి పిల్లలతో కలిసి బయటికి వెళ్లాడు. ఈ క్రమంలో గ్రామ శివారులో హరితహారం మొక్కలకు నీళ్లు పడుతున్న పంచాయతీ ట్రాక్టర్‌పై స్నేహితులతో కలిసి ఎక్కాడు. కొంతదూరం వెళ్లాక డ్రైవర్ పిల్లలను దిగమనడంతో కిందకు దిగారు. వినయ్‌కుమార్ దిగుతున్న సమయంలో డ్రైవర్ ట్రాక్టర్‌ను కదిలించడంతో టైరు కింద పడి అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని వివరాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం దవాఖానకు తరలిం చారు. బాలుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ బంధువులు, గ్రామస్థులు ఆందోళనకు దిగారు.
డాన్స్ క్లాస్‌కు వెళ్లొస్తూ బాలిక..
దామరచర్ల, జనవరి 10: నల్లగొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో జరిగిన ఘటనలో కారు ఢీకొని బాలిక మృతి చెందింది. మండలంలోని రాజగట్టు గ్రామానికి చెందిన కొట్ర ఆంజనేయులు-పద్మావతి కుమార్తె జనిత్రి భవాని (12) ఆదివారం దామరచర్లలో డాన్స్ క్లాస్‌కు వెళ్లింది. సాయంత్రం ఇంటికి తిరిగొస్తున్న క్రమంలో నార్కట్‌పల్లి-అద్దంకి ప్రధాన రహదారి దాటుతుండగా వీర్లపాలెం వైపు వెళ్తున్న కారు వేగంగా ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన బాలికను మిర్యాలగూడ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు వాడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన కారుని స్వాధీనం చేసుకొన్నారు.
ప్రాణం తీసిన బైక్ సరదా
బైకు సరదా యువకుడి ప్రాణాల మీదికి తెచ్చింది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని రాయినిపాలెం గ్రామానికి చెందిన కార్తీక్ కొత్త పల్సర్ బైకు తెచ్చుకొన్నాడు. అతని స్నేహితుడు యార రాకేశ్ (19) బైకు నడపాలనుకొన్నాడు. శనివారం సాయంత్రం బైక్‌పై రాయినిపాలెం నుంచి ముల్కల కాల్వ రోడ్డుకు వెళ్లాడు. మలుపు వద్ద బైకు అదుపుతప్పి ముల్కల సమీపంలోని నాగార్జునసాగర్ కాల్వలోకి దూసుకెళ్లింది. రాకేశ్‌పై బైక్ పడడంతో ఊపిరాడక మృతిచెందాడు. రాకేశ్ ఎంతకూ రాకపోవడంతో కార్తీక్ ఫోన్ చేశాడు. స్విచ్చాఫ్ రావడంతో రాత్రి రోడ్డు వెంట వెతికినా ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉద యం కాల్వలో రాకేశ్ మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టానికి తరలించారు. చేతికందివచ్చిన కొడుకు మృతి చెందడంతో రాకేశ్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
తాజావార్తలు
- అతడు ఇడ్లీ పెట్టాడు..అజిత్ లక్షలు ఇచ్చాడు..!
- నాగచైతన్యకు సురేష్ మామ గిఫ్ట్..?
- రిపబ్లిక్ డే పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా రాఫెల్ విన్యాసాలు
- శ్వేతసౌధానికి ట్రంప్ వీడ్కోలు
- ముక్రా (కే)లో జయశంకర్ యూనివర్సిటీ విద్యార్థులు
- మాల్దీవుల్లో మెరిసిన సారా..ఫొటోలు వైరల్
- అధికారంలోకి రాకముందే చైనా, పాక్‌లకు అమెరికా హెచ్చరికలు
- బాధిత కుటుంబానికి టీఆర్ఎస్ నాయకుడి ఆర్థికసాయం
- బైక్‌ను ఢీకొన్న కంటైనర్.. ఒకరు మృతి
- ఎన్నికల వేళ మమతా దీదీకి మరో ఎదురుదెబ్బ?