బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 16, 2020 , 18:20:15

నేషనల్‌ హైవేస్‌ పనుల్లో వేగం పెంచండి : మంత్రి హరీశ్ రావు

నేషనల్‌ హైవేస్‌ పనుల్లో వేగం పెంచండి : మంత్రి హరీశ్ రావు

సంగారెడ్డి : జాతీయ రహదారుల పనుల్లో వేగాన్ని పెంచాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు  నేషనల్ హైవే అథారిటీ అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నేషనల్ హైవే అథారిటీ, ఆర్ అండ్ బీ అధికారులతో మంత్రి  సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి నియోజకవర్గం వారీగా పెండింగ్ పనుల వివరాలను, కారణాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అందోల్ - అకోలా రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, అందోల్ జోగిపేట్ బైపాస్ రోడ్డు, డ్రైన్ పనులను పూర్తి చేయాలన్నారు.

అలాగే ఉన్న రోడ్లను ఇంప్రూవ్ చేయాలని నేషనల్ హైవే అథారిటీ అధికారులకు సూచించారు. అసంపూర్తి  పనులన్నింటినీ తొందరగా పూర్తిచేయాలన్నారు. జహీరాబాద్ పట్టణంలో డ్రెయిన్స్, ఫుట్ పాత్ పనులకు, కోహీర్ - గుడ్ గార్ పల్లి రోడ్డు పనులకు సంబంధించి ప్రతిపాదనలను సిద్ధం చేసి పంపాలని ఆర్ అండ్ బీ  ఎస్‌ఈకి మంత్రి సూచించారు. వరద కోతకు గురైన రహదారులకు మరమ్మతులు చేపట్టాలని తెలిపారు. బ్యాలెన్స్ రోడ్డు పనులన్నింటినీ పూర్తి చేయాలని ఆదేశించారు.

ఇటీవల కురిసిన వర్షాలకు పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లకు, కూలిపోయిన ఇళ్లకు, పిడుగులు పడి చనిపోయిన పశువులకు నష్ట పరిహారం అందించాలని రెవిన్యూ డివిజనల్ అధికారులకు మంత్రి సూచించారు.సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.