శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Sep 04, 2020 , 18:29:28

కాళోజీ కళాక్షేత్రం పనులను వేగవంతం చేయండి

కాళోజీ కళాక్షేత్రం పనులను వేగవంతం చేయండి

వరంగల్ అర్బన్ : కాళోజీ కళాక్షేత్రం సివిల్ పనులను వేగవంతంగా పూర్తి చేయలని,  కనీసం సివిల్ పనులు అక్టోబర్ నెల చివరి వరకైనా  పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్  రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం బాలసముద్రం లోని హయగ్రీవ చారి కాంపౌండ్ లో రూ.50 కోట్ల అంచనా వ్యయం తో చేపట్టనున్న కాళోజీ కళా క్షేత్రం నిర్మాణా పనులను పరిశీలించారు. సివిల్ వర్క్స్ అన్నింటినీ  అక్టోబర్ వరకు పూర్తి చేసి ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ ఇతర పనులను యుద్ధప్రాతిపదికన  పూర్తయ్యేలా చర్యలు   తీసుకోవాలని టూరిజం శాఖ అధికారులను అదేశించారు. 

అక్కడ నుండి పోచమ్మ మైదాన్ వద్ద  చేపట్టే  మల్టీ కల్చరల్ కాంప్లెక్స్ నిర్మాణా పనులను పరిశీలించారు.  కోటి రూపాయల పనులు చేపట్టగా మిగితా పనులకు  నిధులు మంజూరు కాక పోవడం తో అసంపూర్తిగా ఉందని  టూరిజం శాఖ డిప్యూటీ ఈఈ ఏకాంబరం కలెక్టర్ కు వివరించారు. 


ఖిలా వరంగల్ లో రూ. 3 కోట్ల 85 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన  మ్యూజియం భవన నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ వెంట కుడా పీవో  అజిత్ రెడ్డి, ఎస్ఈ భీమ్ రావు, అర్కియలజీ జిల్లా సహాయ సంచాలకులు నాగరాజు, జిల్లా టూరిజం శాఖ అధికారి శివాజీ తదితరులు పాల్గొన్నారు.


logo