సోమవారం 28 సెప్టెంబర్ 2020
Telangana - Sep 08, 2020 , 02:45:59

దళారి ఇంట్లో డాక్యుమెంట్లు

దళారి ఇంట్లో డాక్యుమెంట్లు

  • ఎమ్మార్వో ‘భూదందా’ దర్యాప్తు ముమ్మరం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కీసర మండలం రాంపల్లి దయారాలో భూ సెటిల్‌మెంట్‌ కేసు దర్యాప్తును ఏసీబీ ముమ్మరం చేసింది. ఈ వివాదంలో ఓ వర్గం వైపునుంచి మధ్యవర్తిత్వం చేసిన ఇక్బాల్‌ ఇంట్లో ఏసీబీ అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. కీసర మండలం బోగారంలోని ఇక్బాల్‌ ఇంట్లో నుంచి పలు కీలకపత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. కీసర తాసిల్దార్‌ నాగరాజుతో సెటిల్‌మెంట్‌ కోసం చేసిన ప్రయత్నాలకు సంబంధించిన పలు భూపత్రాలు పట్టుబడినట్టు తెలిసింది. కీసర మండలంలోని పలు వివాదాస్పద భూములకు సంబంధించిన పత్రాలు సైతం ఇక్బాల్‌ ఇంట్లో దొరికినట్టు సమాచారం. కేసులో కీలక నిందితుడు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి శ్రీనాథ్‌యాదవ్‌ ఏసీబీకి ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో ఇక్బాల్‌ పేరును ప్రస్తావించిన విషయం తెలిసిందే. దీని ఆధారంగా ఏసీబీ అధికారులు ప్రాథమిక నిర్ధారణ తర్వాత ఇక్బాల్‌ ఇంట్లో సోదాలు జరిపినట్టు సమాచారం.


logo