గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 07, 2020 , 02:46:30

ఏసీబీ వలలో ఇరిగేషన్‌ ఏఈ

ఏసీబీ వలలో ఇరిగేషన్‌ ఏఈ

భద్రాద్రికొత్తగూడెం, నమస్తేతెలంగాణ: మిషన్‌ భగీరథ బిల్లుల మంజూరు కోసం లంచం తీసుకుంటూ ఇరిగేషన్‌ ఏఈ సోమవారం ఏసీబీ అధికారులు దొరికాడు. ఏసీబీ డీఎస్పీ మధుసూదన్‌రావు వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం కోటన్ననగర్‌ సమీపంలోని అనంతా రం చెరువు పునరుద్ధరణ పనులను గుండ్ల రమేశ్‌ అనే కాంట్రాక్టర్‌ చేపట్టారు. బిల్లు మంజూరు చేయాలని ఇరిగేషన్‌ ఏఈ నవీన్‌ను కోరగా.. రూ.1.20 లక్షలు లంచం డిమాండ్‌ చేశాడు. సోమవారం ఇల్లెందు మండలంలోని సుభాష్‌నగర్‌లో ఏఈ తన ప్రైవేటు కార్యాలయంలో  రమేశ్‌ నుంచి రూ.1.20 లక్షల నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. 


logo