సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 06, 2020 , 17:30:43

ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై, ఆర్‌ఐ

ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై, ఆర్‌ఐ

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఏసీబీ అధికారులు దాడులు చేసి లంచం తీసుకొంటున్న పోలీసు, రెవెన్యూ అధికారులిద్దరిని రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్న సంఘటన సంచలనం కలిగించింది.  భూమి హద్దులు చూపించాలని గత కొన్ని నెలలుగా బాధితుడు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగాడు.

తనకు 30లక్షల రూపాయలు లంచంగా ఇస్తే హద్దులు చూపిస్తానని బేరం పెట్టాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు  షేక్‌పేట తహసీల్దార్‌ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌గా పనిచేస్తున్న నాగార్జున రెడ్డి బాధితుడి నుంచి 15 లక్షల రూపాయల లంచం తీసుకుంటుండగా శనివారం రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. 

హద్దుల విషయంలో కేసు నమోదు నుంచి తప్పించడానికి బంజార హిల్స్‌లో పనిచేస్తున్న ఎస్సై రవీందర్‌ నాయక్‌ బాధితుడి నుంచి మూడు లక్షల రూపాయలు డిమాండ్‌ చేసి శనివారం లక్షా 50వేల రూపాయలను తీసుకుంటుండగా అతన్ని కూడా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు.  


logo