ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Sep 12, 2020 , 03:44:24

ఐఎంఎస్‌ స్కాం.. మరో 2.29 కోట్లు సీజ్‌

ఐఎంఎస్‌ స్కాం.. మరో 2.29 కోట్లు సీజ్‌

  • ఓ రియల్‌ఎస్టేట్‌ సంస్థ నుంచి ఏసీబీ స్వాధీనం
  • స్థలాల కొనుగోలు కోసం చెల్లించిన నిందితులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఐఎంఎస్‌ (ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌) స్కాం కేసు దర్యాప్తులో ఏసీబీ మరో ముందడుగు వేసింది. ఐఎంఎస్‌ మాజీ డైరెక్టర్‌ దేవికారాణి, ఫార్మసిస్ట్‌ నాగలక్ష్మిల బినామీల పేరిట ఉన్న రూ.2.29 కోట్లను స్వాధీనంచేసుకున్నట్లు ఏసీబీ డీజీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేవికారాణి, ఆమె కుటుంబసభ్యుల పేరిట ఉన్న రూ.1,29,30,000ల నగదును, తన బినామీల పేరిట చెక్కుల రూపంలో ఉన్న రూ.65 లక్షలను స్వాధీనంచేసుకున్నట్లు చెప్పారు. ఫార్మసిస్ట్‌ నాగలక్ష్మికి చెందిన రూ.35 లక్షల నగదును కూడా సీజ్‌చేసినట్లు వివరించారు. ఈ డబ్బులు ఓ రియల్‌ఎస్టేట్‌ సంస్థకు సైబరాబాద్‌ పరిధిలో కమర్షియల్‌, రెసిడెన్షియల్‌ స్థలాల కొనుగోలు కోసం ఇచ్చినట్లు ఏసీబీ అధికారుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఈ రూ.2.29 కోట్లు సదరు రియల్‌ఎస్టేట్‌ సంస్థ వద్ద పట్టుబడినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే దేవికారాణి, నాగలక్ష్మిలపై ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదుచేసిన విషయం తెలిసిందే.logo