సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 06, 2020 , 18:35:12

మేడ్చల్ విద్యాశాఖ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

మేడ్చల్ విద్యాశాఖ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

హైదరాబాద్: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ఘటకేసర్ వద్ద ఒక పాఠశాల నిర్వహణదారుల నుంచి ఇద్దరు ఉద్యోగులు లంచం కోరుతున్నారనే ఫిర్యాదు నేపథ్యంలో పాఠశాల విద్యా శాఖ కార్యాలయంలో సోమవారం అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహించారు. పాఠశాలను సెంట్రల్ సిలబస్‌ నుంచి రాష్ట్ర సిలబస్‌కు బదిలీ చేసినందుకు నో-ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్‌వోసీ) ఇచ్చినందుకు ఇద్దరు అధికారులు లంచం డిమాండ్ చేశారు. డబ్బు ఇవ్వాల్సిందిగా వేధిస్తుండటంతో పాఠశాల యాజమాన్యం ఏసీబీని సంప్రదించింది. స్కూల్ యాజమన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్న ఏసీబీ.. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సోదాలు చేపట్టింది. మరింత సమచారం సేకరించేందుకు ఇద్దరు అధికారులను ఏసీబీ సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. 


logo