శుక్రవారం 29 మే 2020
Telangana - Jan 28, 2020 , 16:27:00

ఏసీబీకి చిక్కిన ఉపాధి హామీ ఏపీఓ

ఏసీబీకి చిక్కిన ఉపాధి హామీ ఏపీఓ

కామారెడ్డి: జిల్లాలోని మాచారెడ్డి మండల ఉపాధి హామీ ఏపీఓ రాజేందర్‌ లంచం తీసుకుంటూ అవినీతి నిరోదక శాఖకు చిక్కాడు. మండలంలోని భవానీపేట, ఆరెపల్లి గ్రామాల్లో నర్సారెడ్డి అనే కాంట్రాక్టర్‌ స్మశానవాటికలు నిర్మించాడు.  దానికి  సంబంధించిన బిల్లు మంజూరు చేయడానికి కాంట్రాక్టర్‌ వద్ద నుంచి రూ. 50 వేలు లంచం డిమాండ్‌ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఈ రోజు ఎంపీడీవో ఆఫీసు వద్ద ఏసీబీ అధికారుల మాటు వేశారు. మొదటి విడతగా రూ.10వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం ఇవ్వడం, లంచం తీసుకోవడం నేరమని ఎవరైనా లంచం డిమాండ్‌ చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు విజ్ఞప్తి చేశారు. 


logo