గురువారం 02 జూలై 2020
Telangana - Jun 15, 2020 , 11:16:55

గుండెపోటుతో ఏసీబీ డీఎస్పీ మృతి

గుండెపోటుతో ఏసీబీ డీఎస్పీ మృతి

హైదరాబాద్‌ : ఏసీబీ డీఎస్పీ ప్రతాప్‌రెడ్డి గుండెపోటుతో మరణించారు. సోమవారం ఉదయం కొంపల్లిలోని తన నివాసంలో గుండెపోటుతో మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన  డీజీ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీగా 

పనిచేస్తున్నారు. వారం రోజుల క్రితం ఓ కేసు దర్యాప్తు విషయంలో ఏసీబీ ఉన్నతాధికారులు ఆయనను సస్పెండ్‌ చేశారు. అప్పటి నుంచి ఆయన ఇంటిలోనే ఉంటున్నారు. 


logo