ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Sep 24, 2020 , 15:20:23

న‌ర్సాపూర్ లంచం కేసు.. ముగిసిన విచార‌ణ‌

న‌ర్సాపూర్ లంచం కేసు.. ముగిసిన విచార‌ణ‌

హైద‌రాబాద్ : న‌ర్సాపూర్ లంచం కేసులో ఐదుగురు నిందితుల క‌స్ట‌డీ నేటితో ముగిసింది. మెద‌క్ అద‌న‌పు క‌లెక్ట‌ర్ న‌గేశ్, ఆర్డీవో అరుణారెడ్డి, త‌హ‌సీల్దార్ స‌త్తార్‌, జూనియ‌ర్ అసిస్టెంట్ వ‌సీం, జీవ‌న్‌గౌడ్‌ను ఏసీబీ అధికారులు నాలుగు రోజుల పాటు ప్ర‌శ్నించారు. ప్ర‌ధానంగా నగేశ్‌పై ఏసీబీ అధికారులు ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించి కీల‌క స‌మాచారాన్ని రాబ‌ట్టిన‌ట్లు తెలుస్తోంది. ఈ ఐదుగురి క‌స్ట‌డీ ముగియ‌డంతో.. వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. అనంత‌రం చంచ‌ల్‌గూడ జైలుకు త‌ర‌లించ‌నున్నారు.

ఓ భూమికి ఎన్వోసీ ఇచ్చేం‌దుకు ఎక‌రా‌నికి రూ.లక్ష చొప్పున రూ. 1.12 కోట్లు డిమాండ్‌ చేసిన కేసులో న‌గేశ్‌తో పాటు మిగ‌తా న‌లుగురు అరెస్టు అయిన విష‌యం తెలిసిందే.  రెండు దఫా‌లుగా రూ.40లక్షల లంచం తీసు‌కు‌న్నట్టు ఇప్ప‌టికే ఆధా‌రాలు లభిం‌చ‌టంతో ఆ సొమ్ము ఎక్కడ దాచా‌ర‌న్న‌దా‌ని‌పైన ఇవాళ విచార‌ణ కొన‌సాగింది. బ్యాంకు లాక‌ర్ల‌పై కూడా న‌గేశ్‌ను ఏసీబీ అధికారులు ప్ర‌శ్నించిన‌ట్లు స‌మాచారం. 


logo